హెచ్‌ఎండీఎకు రూ.27లక్షలు ఎగ్గొట్టిన టీఆర్‌ఎస్‌

10:35 - November 26, 2018

టీఆర్‌ఎస్‌...ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మాయచేయడమే కాదు, ఇప్పుడు ఎవరికైనా నష్ట పరిహారం ఇవ్వల్సి వున్నా వాటిని కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతుంది. అవునండీ నిజమే..అసలు విషియానికి వద్దాం..సెప్టెంబర్‌ 2, 2018న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక సభ ఏర్పాటు చేశారు గుర్తుంది కదా!.అదేనండీ ' ప్రగతి నివేదర సభ '. అయితే  సభా స్థలం పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు ఉండడంతో సభ నిర్వహణకు టీఆర్ఎస్ హెచ్ఎండీఏ అనుమతి కోరింది. అంతేకాక, ఆరోజు టోల్ వసూళ్లను నిలిపివేయాలని కోరింది. అయితే, టోల్ వసూళ్ల ద్వారా రోజుకు రూ. 87 లక్షల ఆదాయం వస్తోందని, దానిని భరిస్తే సభకు అనుమతి ఇస్తామని హెచ్ఎండీఏ తేల్చి చెప్పింది. సరేనన్న టీఆర్ఎస్ ఆ రోజు టోల్ వసూళ్లు నిలిపివేయాలని కోరింది. అయితే ఒప్పందం ప్రకారం హెచ్ఎండీఏకు టీఆర్ఎస్ ఆ మొత్తాన్ని చెల్లించిందా? అంటూ సీపీఎం గ్రేటర్ కార్యదర్శి శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండీఏను కోరారు.దీనికి బదులిచ్చిన హెచ్ఎండీఏ రూ. 59.83 లక్షలు మాత్రమే చెల్లించినట్టు తెలిపింది. అంటే రూ. 27.17 లక్షలను హెచ్ఎండీఏ కు టీఆర్‌ఎస్‌ రూ.27లక్షలు ఎగ్గొట్టినట్టే కదా!.