హీరోయిన్‌ విషయంలో వాళ్లిద్దరూ ఒకటే...

13:29 - September 15, 2018

హీరోయిన్‌ విషయంలో మోగాస్టార్‌ చిరంజీవీ, అక్కినేని నాగర్జునా ఒక్కటే అని చెప్పవొచ్చు. ఎందుకంటే చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 ఈ సినిమాలో   కాజల్ తో చిరంజీవి నటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.  గతంలో కాజల్‌తో చరణ్‌ మూవీస్‌ తీయడం జరిగింది. కోడుకుతో చేసిన హీరోయిన్‌ మళ్ళీ తండ్రితో చేయడం జరిగింది. అయితే..కొడుకు చేసిన హీరోయిన్‌తో తండ్రి సినిమా చేసే లిస్టులో ఇప్పుడు నాగ్‌ చేరుతున్నారు.ఇటీవలే ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటించిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్ త్వరలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో - భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళంలో ధనుష్ మరియు నాగార్జునలు ఒక చిత్రంలో నటించబోతున్నారు. ధనుష్ స్వయంగా ఈ చిత్రంకు దర్శకత్వం వహించబోతున్నాడు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ధనుష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా అధితిరావును ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అను ఎమాన్యూల్ ను కూడా ఈ భారీ ప్రాజెక్ట్ కు ఎంపిక చేసినట్లుగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.  అదితిరావు ధనుష్ కు జోడీ అంటూ గతంలో ప్రచారం జరిగిన కారణంగా నాగార్జునకు జోడీగా అను ఎంపిక అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.