హీరోయిన్‌ నిమ్రత్‌ ప్రేమలో రవిశాస్త్రి

16:26 - September 3, 2018

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ క్లీన్ బౌల్డ్ చేసినట్టు సమాచారం. మిర్రర్ కథనం ప్రకారం...రవిశాస్త్రి పదేళ్ల నుంచి తన భార్య రీతూకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రవిశాస్త్రి నిమ్రత్‌ ప్రేమలో మునిగితేలుతున్నారు. రవిశాస్త్రి, నిమ్రత్ జంట రహస్యంగా రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ తమ రిలేషన్‌షిప్ సంగతి చీమక్కూడా తెలియకుండా జాగ్రత్త పడడం విశేషం. ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 2015 నుంచి అనేక సార్లు తమ కార్ల ప్రారంభానికి ఈ జంటను పిలుస్తుండడం గమనార్హం.  నాటి క్రికెట్ జట్టులో అందగాడిగా ,సూపర్ స్పిన్నర్‌గా పేరున్న రవిశాస్త్రి  వయసు  ప్రస్తుతం 56 ఏళ్లు, నిమ్రత్‌ 36  ఏళ్లు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన ఎయిర్‌లిఫ్ట్ మూవీతో నిమ్రత్ ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం నిమ్రత్ ఓ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో బిజిగా ఉండగా... రవిశాస్త్రి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు.