హీరోగా విరాట్‌ కొహ్లీ

15:58 - September 21, 2018

విరాట్‌ కొహ్లీ ..మన టీం ఇండియా కెప్టెన్‌ గా అందరకికీ సుపరిచితం. అయితే కొహ్లీ ఇప్పటిదాకా చిన్న చిన్న కమర్షియల్‌ యాడ్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ ప్రకటించాడు. నేడు ఉదయం సోషల్ మీడియా ద్వారా తాను హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.  ‘ట్రైలర్’ అనే చిత్రంతో విరాట్ కోహ్లీ హీరోగా పరిచయం కాబోతున్నాడు. వ్రాంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంకు సంబంధించిన ఇతర వివరాలు ఏవీ కూడా బయటకు రాలేదు. 10 సంవత్సరాల తర్వాత మరో కొత్త రంగంలో అడుగు పెట్టబోతున్నట్లుగా కూడా విరాట్ పేర్కొన్నాడు.ఈనెల 28న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లుగా విరాట్ ప్రకటించాడు. ట్రైలర్ విడుదల సమయంలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడి చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక వైపు టీం ఇండియా కెప్టెన్ గా వ్యవహరిస్తూనే మరో వైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు  విరాట్ కోహ్లీ. దీనిపై  ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. విరాట్ కోహ్లీ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆయన ఆటపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.