హిట్‌ కోసం నో కాంప్రొమైజ్‌

16:05 - September 19, 2018

 ఈ మద్య కాలంలో నితిన్‌ కు అన్నీ పరాజయాలే ఎదురవుతున్నాయి. త్రివిక్రమ్ తో అఆ చేసినప్పుడు 2 మిలియన్ డాలర్ల మూవీ రాగానే ఇకపై అంతా శుభమే అనుకున్నాడు. కానీ లైతో మొదలైన ప్లాపుల పర్వం శ్రీనివాస కళ్యాణం దాకా కొనసాగింది. మొత్తానికి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న నితిన్ ఇక నో కాంప్రోమైజ్ అంటున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే భీష్మ(ప్రచారంలో ఉన్న టైటిల్)కోసం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ సినిమాకు సంగీతం కోసం స్టార్ హీరోలకు తప్ప ఇంకెవరికి అంత ఈజీగా దొరకని దేవి శ్రీ ప్రసాద్ ని సెట్ చేస్తున్నారు. అంతేకాదు..హీరోయిన్ గా డిమాండ్ పీక్స్ లో ఉన్న రష్మిక మందన్ననే ఓకే చేసుకోవడం జరిగింది. మిగిలిన విభాగాల్లో కూడా బెస్ట్ టీమ్ మెంబెర్స్ ఉండేలా నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం. అందుకే షూటింగ్ మొదలుపెట్టడం ఆలస్యమవుతోందని సమాచారం. ఖచ్చితంగా హిట్ కొట్టే తీరాల్సిన తరుణంలో ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. పెళ్లి వద్దనుకున్న ఒక యువకుడి జీవితంలో జరిగిన సరదా సంఘటనలు ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందిస్తున్నట్టు  ఇన్ సైడ్ టాక్. ఇన్ని జాగ్రత్తలు తీసుకోని చేస్తున్న ఈ సినిమాతో అయినా నితిన్‌ మళ్లీ హిట్‌ కొడతాడో లేదో వచ్చే ఏడాది వరకూ వేచి చూడాల్సిందే.