హరికృష్ణ అంత్యక్రియల్లో...బౌన్సర్లా మారాడు
10:13 - September 1, 2018

నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో ఆయన కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే...అభిమానులు తారక్‌ను ఇంత విషాదంలో పరిస్థితిలో ఎప్పుడూ చూడలేదు. ఈ పరిస్థితిలో..అంత్యక్రియల సందర్భంగా తారక్, కల్యాణ్‌రామ్‌లను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఈ ఇద్దరు అన్నదమ్ముల కోసం ఒకే ఒక్కరు బౌన్సర్లా నిలబడ్డారు. అతనే మంచు మనోజ్. ఎన్టీఆర్‌కి మంచి మిత్రుడైన మనోజ్ జనాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ధైర్యంగా నిలబడ్డారు. దీనికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోజ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ చూసిన ప్రతి ఒక్కరూ మనోజ్‌ను అభినందిస్తున్నారు.