హన్సిక 50వ సినిమా వివాదాలకు దారితీస్తుందట!

15:32 - December 10, 2018

సినిమాలకు సంబంధించి సృజనాత్మకతకు ఎలాంటి పరిమితులు ఉండవు కాని ఎంచుకున్న కాన్సెప్ట్ ని బట్టి ఎవరివైనా మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందేమోనన్న కోణంలో ఒకటికిరెండు సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. యాపిల్ బ్యూటీ హన్సిక చేసిన తన 50వ సినిమా  చిక్కుల్లో పడేలా ఉంది. యుఆర్ జమీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం పేరు మహా. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్స్ టీమ్ విడుదల చేసింది. అందులో హన్సిక ఇచ్సిన భంగిమ వివాదాలకు కారణం అవుతోంది. ఓ బాబాను పోలి ఉండే అవతారంలో వెనుక పవిత్ర పుణ్య క్షేత్రం కాశి బ్యాక్ డ్రాప్ లో హన్సిక సిగరెట్ తాగుతున్నట్టు ఇచ్చిన స్టిల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇలా చేయడం పట్ల ఇప్పటికే  కొన్ని సంఘాలు చిత్ర యూనిట్ మీద భగ్గుమంటున్నాయి. అయితే టీమ్ ఇంకా దీని గురించి స్పందించడం లేదు. కథ డిమాండ్ మేరకు ఆలా చూపించాల్సి వచ్చింది తప్ప మరో ఉద్దేశం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. వేషాలు మార్చి మోసాలు చేసే మాయలేడి వేషంలో హన్సిక రోల్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.