స్పాట్‌లోనూ అదే లుక్‌

10:56 - November 19, 2018

రామ్‌ చరణ్‌, తారక్‌తో కలిసి రాజమౌళీ మూవీ తీస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచీ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా తీస్తారా? అని ఎదురుచూస్తూ వున్నారు. ఇంతలో ఒకే ఫ్రేమ్‌లో చరణ్‌, తారక్‌, రాజమౌళీతో కలిపి ఒక ఫోటో విడుదలైంది. దీంతో ప్రేక్షకుల్లో ఇంకాస్త ఆతృత ఎక్కువైంది. అనుకున్న విధంగానే ' ఆర్‌ఆర్‌ఆర్‌ ' ఒక మంచి ముహుర్తాన ప్రారంభమైంది. అయితే ఈ సినిమా కోసం జక్కన్న సెట్‌లోనే ఒక ఇల్లు తయారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా సెట్స్‌లో ఎప్పుడు ప్రారంభమవుతుందా? అనుకుంటున్న ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరదించుతూ..'ఆర్‌ఆర్‌ఆర్ ' సెట్స్‌పై తనతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి దిగిన పిక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు జక్కన్న. ఈ రోజే  ' ఆర్‌ఆర్‌ఆర్ ' రోలింగ్ ప్రారంభమైంది అని ట్యాగ్ చేశారు. ఆ రోజు ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో ఎలాగైతే దర్శనమిచ్చారో.. ఇప్పుడు కూడా అలాగే సెట్స్‌పై మరోసారి దర్శనమివ్వటం చూసి మురిసిపోతున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.