సొంత బ్యానర్‌ బాటలో సందీప్‌ కిషన్‌

15:22 - November 23, 2018

హీరోలు తమకంటూ ఓ సొంత బ్యానర్ ఉండాలనే నిర్ణయానికి చాలాకాలం క్రితమే వచ్చేశారు. ఇప్పుడు హీరో సందీప్‌ కిషన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.  సందీప్‌కి తొలి హిట్ ఇచ్చిన చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' కావడంతో, ఆ సెంటిమెంట్ తో 'వెంకటాద్రి టాకీస్' పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో తెలుగు .. తమిళభాషల్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సూపర్ పవర్ వున్న హీరో చుట్టూ తిరిగే కథ ఇది. కొంతకాలంగా సందీప్ కిషన్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. సొంత బ్యానర్లో చేసే సినిమాతో సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.  తమ అభిరుచికి తగిన సినిమాలను తామే నిర్మించుకోవడానికి కొంతమంది హీరోలు సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ వుంటే, మరికొంతమంది ఇతర హీరోలతోనూ సినిమాలు చేసే ఆలోచనతో సొంత బ్యానర్లు స్థాపిస్తున్నారు.