సైలెంట్‌ థ్రిల్లర్‌గా అనుష్క

11:14 - August 27, 2018

అనుష్క తాజాగా ఓ సైలెంట్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత, నిర్మాత కోనవెంకట్‌ దర్శకుడిగా మారుతున్నారు. దీనిలో మాధవన్‌ హీరోగా నటిస్తున్నారు. 'అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రధారులుగా కోనవెంకట్‌ దర్శకత్వంలో సైలెంట్‌ థ్రిల్లర్‌ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి 'సైలెంట్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో అంతర్జాతీయ తారాగణం నటించనుంది. ఈ సినిమాలో మాధవన్‌ పాత్ర  కీలకంగా ఉంటుంది. కథ నచ్చి అనుష్క సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తారు. థ్రిలర్‌ నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది ' అని చిత్ర బృందం తెలిపింది.  ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. మాధవన్‌ ప్రస్తుతం 'సవ్యసాచి', 'జీరో' చిత్రాల్లో నటిస్తున్నారు.