' సైరా '...' సాహో ' రెండూ ఒకే రోజు వస్తున్నాయట!

16:07 - November 29, 2018

చిరూ ఫ్యాన్స్‌కి, ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఒకే రోజు పండుగ రాబోతుంది. ఎందుకనుకుంటున్నారా?..' సైరా ', ' సాహో ' రెండూ కూడా ఒకే రోజు రిలీజ్‌ అవుతున్నాయట!. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ కారణంగా ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.  ఇక ' సాహో ' విషియానికి వస్తే...ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' నిర్మితమవుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. మొదట ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటికి పనులు పూర్తికావనే ఉద్దేశంతో, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో, ఇప్పుడు ఈ విషయాన్ని గురించిన చర్చలే ఫిల్మ్ నగర్లో నడుస్తున్నాయి.