' సైరా 'లో మెగా డాటర్‌

12:56 - September 12, 2018

' సైరా ' లో మెగా డాటర్‌ నిహారిక ఒక కథకళి డ్యాన్సర్‌ పాత్రలో కనిపిస్తుందట. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక కొణిదెల.  రెండు తెలుగు సినిమాలు ఒక తమిళ ఫిలింలో నటించిన నిహారిక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది.  ఈ పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు ఇప్పుడు కథకళి ట్రైనింగ్ తీసుకుంటోందట.  సినిమాలో నిహారిక స్క్రీన్ టైమ్ పది నిముషాలే కానీ కథలో మాత్రం నిహారిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట.  'సైరా' తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి నిహారిక కు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.