' సైరా 'లో బన్నీ వాయిస్‌

11:35 - November 20, 2018

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ' సైరా '. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనేకమంది సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంభందించి మరో సమాచారం బయటకు వచ్చింది. అది ఎవరి గురించో కాదు స్టైలిష్‌ స్టార్‌ అల్లూ అర్జున్‌ గురించి. ఈ సినిమాలో అల్లూ అర్జున్‌ వాయిస్‌ వుంటుందట!. ఈ  సినిమా వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. బన్నీ వాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది .. వినగానే ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు. బన్నీకి గల క్రేజ్ కారణంగా వాయిస్ ఓవర్ ఆయనతో చెప్పిస్తే బాగుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించాడట. ఈ విషయాన్ని ఆయన చిరంజీవి దగ్గర ప్రస్తావించగా, బన్నీతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే బన్నీతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు.