' సైరా ' లో నయన మోషన్‌ టీజర్‌ రిలీజ్‌

11:43 - November 18, 2018

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సినిమా  ' సైరా నరసింహారెడ్డి  '. నేడు నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం విషెస్ చెబుతూ.. నయన్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన మోషన్ టీజర్‌ను విడుదల విడుదల చేయడం జరిగింది.  ' వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే నయనతార. ఈ సందర్భంగా  ' సైరా నరసింహారెడ్డి  ' నుంచి సిద్ధమ్మ అద్భుతమైన లుక్  ' అని ట్వీట్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నయన్ పాత్ర పేరు సిద్ధమ్మ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణానంతరం ఆయన స్ఫూర్తితో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఈ పాత్రను కూడా చిరంజీవితోనే చేయించనున్నట్టు సమాచారం.