' సైరా 'లో తమన్న కొత్త వేషధారణ

15:18 - December 21, 2018

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' నిర్మితమవుతోంది. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజున తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా తమన్నా పాత్రను పరిచయం చేస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఫస్టులుక్ ను .. మోషన్ టీజర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా .. లక్ష్మి పాత్రలో కనిపించనుందనేది మోషన్ టీజర్ వలన తెలుస్తోంది. తమన్నా పాత్ర తీరుతెన్నుల  విషయం అటుంచితే, ఆమె వేషధారణ మాత్రం కొత్తగా వుంది. కొత్త తమన్నాను తెరపై చూడబోతున్నామనే ఆసక్తిని పెంచుతోంది. 'బాహుబలి' తరువాత తమన్నా చేస్తోన్న భారీ చిత్రం ఇదే. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే ఆశాభావంతో తమన్నా వుంది. భారీ తారాగణంతో .. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి  ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.