' సైరా ' నుంచి రిలీజైన మోషన్‌ టీజర్‌

10:35 - October 11, 2018

మెగాస్టార్‌ చిరంజీవి 151 చిత్రం ' సైరా '. దీని షఉటింగ్‌ శరవేగంగా నడుస్తుంది. ఇందులో అతిరథ మహానటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత షెడ్యూల్‌ను జార్జియాలోని ఓ అద్భుత లొకేషన్‌లో చిత్రీకరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర మోషన్ టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ రోజు  బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేస్తూ మోషన్ టీజర్‌ను వదిలింది చిత్రబృందం. ఈ చిత్రంలో అమితాబ్... చిరుకు గురువుగా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ, సుదీప్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.