సెన్సార్‌ పూర్తి చేసుకున్న ' 2.ఓ '

11:31 - November 24, 2018

శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2.ఓ' సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. 2 గంటల 29 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైపోయింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఒక వైపున రజనీ అభిమానుల్లోను .. మరో వైపున అక్షయ్ ఫ్యాన్స్ లోను ఆత్రుత పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. అద్భుతమైన గ్రాఫిక్స్ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. ముఖ్యంగా అక్షయ్ కుమార్ లుక్ అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది.