సృజనాత్మకతకు వయసుతో పనిలేదు

16:49 - August 20, 2018

సాదారణంగా 89 ఏండ్ల వయసులో ఉన్న మహిళలు ఏం చేస్తారు? తీరికగా ఇంట్లో కాలం వెల్లదీస్తారు. లతికా చక్రబర్తి మాత్రం అలా చేయడంలేదు. అందరికన్నా భిన్నంగా ఆలోచించి, తనలోని నైపుణ్యానికి పదును పెడుతుంది. ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించి పొట్టి సంచులను వివిధ డిజైన్లల్లో కుట్టి అమ్ముతుంది. వస్తువులకు గడువు తేదీ ఉంటుంది. కానీ మనుషుల ఆలోచనలకు గడువు తేదీ వుండదు. 89 ఏండ్ల వయసులో కూడా తనలో వున్న సృజనాత్మకతకు పదును పెట్టి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టింది లతికా చక్రబర్తి.
అస్సోంలోని దుబ్రిలో పుట్టిన ఈమె మెరిట్‌ స్టూడెంట్‌. ఈమెకు సర్వేయర్‌ ఆఫీసర్‌తో పెండ్లి జరిగింది. భర్త ఉద్యోగరిత్యా దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగారు. ఇలా అన్ని ప్రాంతాలకూ వెళ్లడం అక్కడ కొద్ది రోజులు ఉండటం సహజంగా మారింది. ఈమె ఇంట్లో ఖాళీగా ఉండకుండా....చిన్న పిల్లలకు బట్టలు కుట్టడం, పిల్లలు పెద్దయ్యాక చిన్నవైన బట్టలతో బొమ్మలు తయారు చేయడాన్ని అలవాటుగా చేసుకుంది. పాత బట్టలతో సంచులు కుట్టం నాలుగేండ్ల కిందట నుంచి ప్రారంభించింది. ఇప్పటిదాకా 300కు పైగా బ్యాకులు కుట్టింది. వీటిని కుటుంబ సభ్యులు, చుట్టాలకు, ఫ్యామిలీ ఫంక్షన్‌లలో గిఫ్ట్‌లుగా ఇస్తుంది. జర్మనీలో వున్న లతిక చక్రబర్తి మనుమడు జారు చక్రబర్తి అతిని నానమ్మ(లతిక చక్రబర్తి)బ్యాగ్స్‌ అమ్మడం కోసం లతిక బ్యాగ్స్‌ అనే ఆన్‌లైన్‌ వెంచర్‌ ప్రారంబించి ఇచ్చాడు. 
ఈ సైట్‌లో ఐదువందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల ధరలకు బ్యాగ్స్‌ అందుబాటులో వున్నవి. ఈమెకు మన దేశంతోపాటు జర్మనీ, న్యూజిలాండ్‌ నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మంచి పని చేయడానికి వయసుతో సంబంధంలేదు అంటున్నారు లతిక. వయసుకు, సృజనాత్మకతకు సంబందలేదని నిరూపించిన లతిక ఎందరికో స్పూర్తిదాయకం.