సుప్రీం తీర్పుతో..దీపావళికి ముందే బాంబు పేలింది..!

14:45 - October 23, 2018

దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం అన్న విషియం అందరికీ తెలిసిందే. దీపావళి పండుగకు ఇంకా 15 రోజులు టైం వుంది. అయితే దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు ఇప్పుడే బాంబు పేలినంత పనైంది. ఆ తీర్పు ఏంటా అనుకుంటున్నారా? అయితే అసలు విషియానికొస్తే...దీపావళి సందర్భంగా అమ్మే టపాసులపై బ్యాన్ విధించాలని.. కాల్చకుండా అడ్డుకోవాలని.. పర్యావరణాన్ని రక్షించాలంటే దరిద్రపు దీపావళి పండక్కి టపాసులు కాల్చాలా? ఏంటి అంటూ ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించింది.  టపాసుల్ని కాల్చటం ద్వారా పర్యావరణం దారుణంగా దెబ్బ తింటుందన్న ఆందోళనల్ని వ్యక్తం చేస్తూ కొందరు పర్యావరణ ప్రేమికులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్లను విచారించిన న్యాయస్థానం..టపాసుల అమ్మకాలపై బ్యాన్ విధించలేం కానీ.. అమ్మకాల మీద కొన్ని పరిమితులు.. టపాసులు కాల్చే విషయంలోనూ కొన్ని పరిమితుల్ని విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది. ఇక.. దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం తక్కువ సౌండ్ వచ్చే టపాసుల్ని విక్రయించాలని.. ఉద్గారాలు సైతం తక్కువగా విడుదలయ్యేలా బాణసంచా తయారు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్నింటికి మించి రెండు గంటల సమయమే బాణసంచా కాల్చటానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. సర్కారు చెప్పిన రెండు గంటల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. లేదంటే.. విజిల్ ఊదుతూ పోలీసులు కేసులు పెడతారో ఏమో?.