సీక్వెల్స్‌ క్వీన్‌గా అంజలి

10:58 - December 6, 2018

తెలుగింటి సీతమ్మ అంజలి ఏం చేస్తోంది? గత కొంత కాలంగా తెలుగు లోగిళ్ల లో ఈ అమ్మడి సందడి కనిపించనేలేదేం?  అంటూ యూత్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓ వైపు హీరో జై ని పెళ్లాడి అంజలి చెన్నయ్ లోనే స్థిరపడిందని వార్తలు వస్తున్నా.. వాటి గురించిన సరైన వివరం లేనేలేదు. అదంతా సరే .. కెరీర్ సంగతేంటి? అని ప్రశ్నిస్తే ఆ విషయంలో అస్సలు డోఖానే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి సీక్వెల్స్ క్వీన్ గా వెలిగిపోతోంది. ఓవైపు గీతాంజలి సీక్వెల్ లో నటిస్తూనే `నాడోడిగల్` సీక్వెల్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇవి రెండూ శర వేగంగా పూర్తవుతున్నాయి. వీటితో పాటు `లిసా` అనే 3డి స్టీరియో స్కోపిక్ చిత్రంలో నటిస్తోంది. ఇండియా లోనే ఈ తరహా ప్రయత్నం తొలిసారి అని చెబుతున్న ఈ సినిమా టీజర్ ఇదివరకూ రిలీజై ఆకట్టుకుంది. తెలుగు తమిళం హిందీ మలయాళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. దీంతో పాటే `ఓ` ఆనే ఆసక్తికర కాన్సెప్టు ఉన్న చిత్రంలో నటిస్తోంది. పేరంబు - మదగజ రాజా - కాన్ బతు పొయ్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.  వీటితో పాటు క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి సరసన ఓ చిత్రానికి కమిటైంది మన సీతమ్మ. తెలుగులో అంతగా అవకాశాల్లేవేంటో అనుకునే వాళ్లకు ఇంతకుమించిన ప్రాక్టికల్ సమాధానం వేరొకటి ఉంటుందా?   వీలున్నప్పుడల్లా ఇదిగో ఇలా ఫోటోలు దిగి అభిమానులకు షేర్ చేస్తోంది.