సీక్వెల్స్‌ అందుకే తీస్తారట!

16:11 - October 15, 2018

గత కొంతకాలంగా అన్ని ఇండస్ట్రీస్లోనూ సీక్వెల్ సినిమాల హవా సాగుతోంది. అయితే సీక్వెల్స్‌ ఎందుకు తీస్తున్నారో అనే విషియాన్ని నిర్మాత ఠాగూర్‌ మధు తెలియజేశారు. . హైదరాబాద్ - ప్రసాసన్ నగర్లోని ఠాగూర్ మధు ఆఫీస్లో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. వరుసగా ఇలా సీక్వెల్స్ తెరకెక్కించడానికి అసలు కారణమేంటి? ఆ గుట్టు లీక్ చేస్తారా.. ప్లీజ్! అని `పందెంకోడి 2` నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధుని అడిగేస్తే ఆయనేమన్నారో తెలుసా?..హిట్టొచ్చిన సినిమాకి సీక్వెల్ తీస్తుంటే జనాల్లో ఉండే క్రేజు వేరు. మరో హిట్టొచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే సీక్వెల్ సినిమాలు తీసేందుకు అంతటా ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. పందెంకోడి 2 ని దాదాపు 13 ఏళ్ల తర్వాత తీస్తున్నా.. ఇప్పటికీ పందెంకోడి అభిమానుల్లో డిస్కషన్ సాగుతూనే ఉండడం తమకు కలిసొస్తుందని అన్నారు. పందెంకోడి పాత్రలు సీక్వెల్లో కనిపిస్తాయి. పెర్ఫెక్ట్ సీక్వెల్ ఇదని తెలిపారు. ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజవుతోంది. పెద్ద విజయం అందుకుంటామని ధీమాని వ్యక్తం చేశారు. ఈ దసరా పందెంలో మరో హిట్టు రాబోతోంది. పందెంకోడి సిసలైన యాక్షన్ డ్రామా ఉన్న సినిమా. యాక్షన్ కంటే ఫ్యాక్షన్ కంటే డ్రామా ఆకట్టుకుంటుంది. జాతర బ్యాక్డ్రాప్లో రెండు ఊళ్ల మధ్య ఘర్షణ సమస్య ఏంటి? అన్నది తెరపై చూడండి.. అని అన్నారు.