సిద్దూ మాటల వెనుక అసలు రహస్యం అదేనా?

11:17 - November 10, 2018

తెలుగులో హీరోగా నటించి పలు సక్సెస్ లు దక్కించుకున్న సిద్దార్థ ఇప్పుడు వరుస ఫ్లాప్ లు పడటంతో తమిళంకు షిప్ట్ అయ్యాడు. అక్కడ కూడా వరుసగా ఫ్లాప్ లు రావడంతో అవకాశాలు సన్నగిల్లాయి. సినిమాల్లో ఫ్లాపులు ఎదుర్కొంటున్న సిద్దార్ధ సోషల్‌ మీడియాలో మాత్రం  బర్నింగ్ ఇష్యూస్ పై తనదైన గళం వినిపించడం వల్ల సిద్దార్థ ఈమద్య కాలంలో మీడియాలో ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ కూడా గతంలో తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాల పట్ల స్పందించడం - ఎప్పటికప్పుడు తన ఆలోచనలను - రాజకీయ నాయకులపై షాకింగ్ వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉండేవాడు. త్వరలోనే ప్రకాష్ రాజ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఈ సమయంలోనే సిద్దార్థ కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇలా తనకు సంబంధం లేని విషయాల్లో గళం వినిపించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.  సిద్దార్థ భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఉండే అవకాశం లేకపోలేదు. సినిమాల్లో ఛాన్స్ లేని వారు వ్యాపారమో - రాజకీయమో చేయడం ఈమద్య సర్వ సాదారణం అయ్యింది.