సిక్కోలుకు కొండంత అండగా దేవరకొండ సాయం

13:22 - October 15, 2018

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ, ' గీతా గోవిందంతో ' స్టార్‌ హీరోగా మారాడు. అయితే దేవరకొండ సినిమాల్లోనే కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నారు. అదెలా అనుకుటున్నారా? అయితే ఇది చూడండి. ఇటీవల ' తితలీ ' తుఫానుకు శ్రీకాకులంలోని 169 గ్రామాలు అంతా నాశనం అయిపోయాయి. ఈ బీబత్సవానికి చెట్లు, ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన విజయ్ దేవరకొండ స్పందించి సహాయంగా రూ.5లక్షలు విరాళంగా అందించాడు. అయితే ఈ సందర్భంలో విజరు దేవరకొండ గతంలో చేసిన ఆర్థిక సహాయాలను కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకోవలిసిన అవసరం వుంది. ఇటీవల తనకు వచ్చిన మొదటి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేయగా వచ్చిన 25లక్షలను విరాళంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళకు తన వంతుగా రూ. 5లక్షలు సాయం చేసి విజయ్ కొండంత మనసును చాటుకున్నాడు. సాయం చేసే విషయంలో ముందు వరుసలో ఉండే విజయ్‌దేవరకొండను నెటిజన్లు మెచ్చుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.