సిఎం కుమారస్వామిని హత్య చేసేందుకు బీజేపీ సుపారీ ఇచ్చిందట!

11:18 - November 1, 2018

తన హత్యకు బీజేపీ నాయకులు సుపారీ ఇచ్చారని సీఎం కుమారస్వామి కొత్త బాంబు పేల్చారు. పదేళ్ళక్రితం జేడీఎస్‌, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న వేళ నన్ను హతమార్చేందుకు బీజేపీ సుపారీ ఇచ్చిందని శివమొగ్గలో ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా తెలిపారు. సుపారీ ఇచ్చాక బీజేపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేశారని అప్పుడు యడ్యూరప్ప ఎందుకు మాట్లాడలేదని అభ్యంతరం తెలిపారు. తనను హతమార్చేందుకు సుపారీ ఇచ్చి బళ్ళారిలో తనకు వ్యతిరేకంగానే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు. మధుబంగారప్ప నామినేషన్‌ వేసినప్పటి నుంచి పరిశీలిస్తున్నానని ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. బడ్జెట్‌లో ఆమోదం తెలిపిన అంశాలపై ప్రసంగాలు కూడా నిబంధనల ఉల్లంఘన అవుతుందా..? అని ప్రశ్నిం చారు. యడ్యూరప్ప ఆపరేషన్‌ కమల నడిపి 20  నియోజక వర్గాలను ఉప ఎన్నికలవేళ దత్తత తీసుకుంటామని చెప్పడం ఉల్లంఘన కాదా... అన్నారు. తాను బంగారప్పను దుర్వినియోగం చేసుకోవడం లేదని, కాగోడు తిమ్మప్ప పట్ల బీజేపీ నాయకులు చులకనగా మాట్లాడడం సరైనదేనా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోతుందని చెప్పుకున్న బీజేపీ నేతలు ప్రస్తుతం దీపావళికి టార్గెట్‌ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.