' సాహో ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

15:19 - December 17, 2018

ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయం పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ వుండనున్నాయి. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేష్ .. అరుణ్ విజయ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. 'బాహుబలి 2' తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో, ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు.