' సవ్వసాచి ' ట్రైలర్‌ సూపర్‌

16:03 - October 24, 2018

ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌తో చందూ మొండేటి ' సవ్వసాచి ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నేడు(బుధవారం) రిలీజ్ అయింది. చందూ మొండేటి ద‌ర్శక‌త్వంలో అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం ' సవ్వసాచి ' . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. మాధ‌వ‌న్ కీల‌క పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్‌ పరంగా చూస్తే సినిమాకు ఒకరకంగా మాధవనే హైలైట్. విలన్‌గా ఆయన నటన అద్భుతం. '  ప్రేమ, కోపం లాంటి ఎమోషన్స్ మీకు వస్తే.. మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు. అదే నాకొస్తే నాతోపాటు ఇంకొకరు కూడా రియాక్ట్ అవుతారు ' అంటూ చైతు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఓ మిస్టరీని చేధించే క్రమంలో చైతు నటన ఆసక్తిని కలిగిస్తుంది. '  చావైనా నిన్ను చేరాలంటే.. అతని ఎడమ చెయ్యి దాటి రావాలి ' అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ చైతు క్యారెక్టర్‌ని విశ్లేషిస్తోంది. మొత్తంగా ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.