' సవ్వసాచి 'కి ముందు కాస్త భయపడ్డాను : చైతు

16:11 - November 1, 2018

అక్కినేని నాగచైతన్య `సవ్యసాచి` చిత్రంలో నటించాలని అనుకోలేదా?  చందు మొండేటి లైన్ వినిపించగానే అసలు ఈ కాన్సెప్టులో నటిస్తే వర్కవుటవ్వడని భావించాడా? అంటే అవునని చైతూ స్వయంగా చెప్పారు. మీడియాతో మాట్లాడిన నాగచైతన్య .. అసలు `సవ్యసాచి` కాన్సెప్టు చందు చెప్పినట్టే తీస్తే వర్కవుటవ్వదని భావించాను. ప్రారంభం అతడు కథ చెప్పగానే కాస్త భయపడ్డాను. వద్దని అనుకున్నాను. కానీ చందు ఆ తర్వాత అన్ని కమర్షియల్ అంశాల్ని ఏర్చి కూర్చి తిరిగి కథను పూర్తి స్థాయిలో వినిపించాడు. అప్పుడు ఇక వెంటనే చేసేయాలని అనుకున్నాను.. అని చైతూ తెలిపారు. సవ్యసాచి పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలు ఉన్న ఓ చక్కని వినోదాత్మక చిత్రమని అన్నారు. సవ్యసాచిలో తన పాత్రకు లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ ఉంటుందని చెప్పినప్పుడు అసలు అలాంటి ఓ సమస్య ఉంటుందా? అని ఆ తర్వాత ఇంటర్నెట్ లో వెతికాను. ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూశాను. ఆ తరహా ఇంకెవరికైనా సమస్య ఉంటే ఆ వీడియోల్ని చూశాను. బోలెడంత సమాచారం నెట్ లోనే చూసి - చదివి తెలుసుకున్నాను.. అది తెరపై బాగా నటించేందుకు ఎంతో సహకరించిందని తెలిపారు చైతన్య.