' సర్కార్‌ ' తో మురుగదాస్‌ పాత గాయాలు మానేనా?

14:46 - September 30, 2018

ఈ తరం దర్శకుల్లో శంకర్ తర్వాత మురుగదాస్ పేరే చెప్పొచ్చు. కాని అదేంటో దాస్ చేసిన రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేదు ఫలితాన్నే ఇచ్చాయి. చిరంజీవితో తీసిన స్టాలిన్ జస్ట్ యావరేజ్ అనిపించుకోగా మహేష్ బాబు స్పైడర్ పేరు తలుచుకోవడానికి కూడా ఫ్యాన్స్ ఇష్టపడరు. ఇక  దాస్ కొత్త సినిమా సర్కార్ విడుదలకు రెడీ అవుతోంది. గతంలో స్టైలిష్ గా విజయ్ సిగరెట్ తాగుతున్న ఫస్ట్ లుక్ విడుదల చేసి కామెంట్స్ అందుకున్న దాస్ ఆడియో రిలీజ్ పోస్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని విజయ్ ని  కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. తమిళ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి సర్కార్ పోస్టర్లకు భారీ స్పందన దక్కుతోంది. రాజకీయ నేపధ్యంలో రూపొందిన సర్కార్ లో కీర్తి సురేష్ హీరొయిన్. ఒక స్పెషల్ క్యామియోలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. విదేశాల నుంచి వచ్చి ఇక్కడి పరిస్థితులు చూసి చలించి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఎన్ఆర్ఐగా విజయ్ పాత్ర ఉంటుందని ఇన్ సైడ్ టాక్.  ఇది హీరో దర్శకుడికి హ్యాట్రిక్ మూవీ. గతంలో తీసిన తుపాకి కత్తి ఒకదాన్ని మించి బ్లాక్ బస్టర్స్ కావడంతో దీని మీద అంచనాలు కోలీవుడ్ లో ఆకాశాన్ని అంటుతున్నాయి.  నవంబర్ లో దీపావళి కానుకగా విడుదల కానున్న సర్కార్ స్పైడర్ తరహాలోనే పబ్లిసిటీ పరంగా మాత్రమే బెస్ట్ అనిపించుకోకుండా కంటెంట్ పరంగా కూడా మెప్పించాలని అభిమానుల కోరిక.