సరికొత్త పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వనున్న అనుష్క!

12:40 - October 31, 2018

ఎప్పుడో జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత స్వీటీ అనుష్క మళ్ళి వెండితెరపై కనిపించక అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. అయితే ఇప్పుడు 
లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో ఇంతకు ముందు చేయని సరికొత్త పాత్రతో అనుష్క రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్.అందులో హీరో ఎవరు లాంటి విషయాలు మాత్రం ఇప్పటికి  గుట్టే. బాహుబలి తర్వాత నిజానికి అనుష్కకు లెక్కలేనన్ని ఆఫర్స్ వచ్చాయి. భాగమతి తర్వాత కూడా అంతే. కొరటాలశివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 152 సినిమాకు అనుష్కనే అడిగినట్టు ప్రచారం జరిగింది. అనుష్క స్క్రీన్‌ మీద కనపడకపోయేసరికి అందరూ ఎవరికితోచినట్లు వారు ఊహించుకున్నారు. గత కొంత కాలంగా వెయిట్ లాస్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి దానికి సంబందించిన శిక్షణలో బిజీగా ఉన్న అనుష్క త్వరలోనే స్వదేశానికి తిరిగి రానుంది. అందరూ ఊహిస్తున్నట్టు పెళ్లి కోసం కాదు. ఓ తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవ్వడానికి. ఆ మధ్య ప్రభాస్ తో పెళ్లి అంటూ కొంత కాలం లేదు ఫ్యామిలీ సెట్ చేసిన బిజినెస్ మెన్ సంబంధం అంటూ కొంతకాలం మీడియాలో నానా రచ్చ జరిగింది. కానీ అదంతా తూచ్ అని తెలుస్తూనే ఉంది. ఫైనల్ గా అనుష్క చేయబోయే సినిమాలు తన ఫ్యూచర్ గురించి క్లారిటీ రావాలంటే వచ్చాకే అడగాలి.