సమంతాకు డబ్బే ముఖ్యమంట!

18:07 - September 11, 2018

సమంతా అక్కినేనికి డబ్బే ముఖ్యమని రీసెంటుగా ఇచ్చిన ఒక ఇంటర్యూలో చెప్పడం జరిగింది.  సమంతా తాజా చిత్రం 'U టర్న్' సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంతా బిజీగా గడుపుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రశంసలు.. విమర్శలు.. వసూళ్ల గురించి మాట్లాడింది.  "సినిమా అనేది బిజినెస్. ఎవరైనా లాభాలు రావాలని సినిమాలు తీస్తారు. సినిమాకు పేరొచ్చి వసూళ్లు రాకపోతే ఎందుకు? నాకు పేరు ముఖ్యం కాదు. వసూళ్లే ముఖ్యం. సినిమాకు డబ్బులు రావడమే ముఖ్యం" అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే సమంతా తన రెమ్యునేషన్‌ గురించి మాట్లాడలేదు. అమె సినిమాకు డబ్బులు రావడమే ముఖ్యం అని చెప్పారు.  తనకు షూటింగ్ లో లగ్జరీలకంటే మంచి సినిమాలో భాగం అవుతున్నానా లేదా అని ఆలోచిస్తానని ఈ సినిమా విషయంలో లగ్జరీల గురించి ఆలోచించకుండా సినిమా చేశానని చెప్పింది.