సమంతను మాటలతో ఆకాశానికెత్తిన మంత్రి కవిత

14:51 - September 18, 2018

వినాయక చవితి కానుకగా విడుదలైన ' యూటర్న్‌ ' చిత్రం పాజిటీవ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. దీనిలో సమంత ఒక కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ మెసేజ్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.  తాజాగా మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత హాజరై సమంత గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ‘‘యూటర్న్ మూవీ అద్భుతమైన సినిమా. ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చిన మెసేజ్ వెలకట్టలేనిది. ఈ సినిమా చూశాక ప్రజల్లో మార్పు వచ్చింది. ఆధునిక మహిళకు సమంత గొప్ప ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.  రంగస్థలంలోని సమంతకు.. యూటర్న్ లోని సమంతకు అస్సలు పోలికే లేదు.. సమంత నటియే కాదు.. గొప్ప మానవతా వాది. తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. అలాగే తెలంగాణ హ్యాండ్లూమ్స్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ చేనేతకు గుర్తింపు తెచ్చారు. ’ అంటూ సమంతను ఆకాశానికెత్తేశారు. ప్రస్తుతం సమంత - చైతన్య నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయని.. ఈ రెండు సినిమాలు బాగా నడుస్తున్నాయని కవిత మెచ్చుకున్నారు.