సక్సెస్‌ లేదు కానీ..రెమ్యునరేషన్‌ మాత్రం పీక్స్‌లోనేనట!

15:16 - December 13, 2018

సినిమా పరిశ్రమే అంత. జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక్కోసారి కొందరి కెరీర్ల ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మెహ్రీన్ ను చూస్తే ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఈ అమ్మడి కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే. ఒకటి కృష్ణగాడి వీరప్రేమ గాధ మిగిలింది రాజా ది గ్రేట్. అంతే ఆ తరువాత చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్‌ కాలేదు. యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో చేసిన నోటా దారుణ ఫలితాన్ని ఇచ్చింది. గోపీచంద్ 25వ సినిమాగా ప్రచారం జరిగిన పంతం వల్ల ఒరిగింది కూడా శూన్యం. ఇంకాస్త వెనక్కు వెళ్తే సాయి ధరం తేజ్ జవాన్ సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య లాంటివన్నీ క్యు కట్టి కనిపిస్తాయి. అయితే ఈ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా అమ్మడి రెమ్యునరేషన్ మాత్రం పీక్స్ లో ఉందట. మొహమాటం లేకుండా 75 లక్షల దాకా చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. జిఎస్టి ఫ్లైట్ చార్జీలు లాంటివి అదనంగా ఉంటాయనుకోండి అది వేరే విషయం. అందుకే నిర్మతలు మెహ్రీన్ ను తీసుకునే విషయంలో ఈ ధరకు సిద్ధపడితేనే వెళ్తారట. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా ఫీలవుతుందట!. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ భామ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటిస్తున్న ' ఎఫ్‌2 ' లో నటిస్తుంది. దీంతో ఇది కనక పెద్ద హిట్ అయితే బ్రేకులు లేకుండా ఆఫర్లు వస్తాయనే అంచనాలో ఉందట. అయినా ఇన్నేసి ఫ్లాపులు వస్తున్నా మెహ్రీన్ ఇలా డైరీ ని బిజీ గా మైంటైన్ చేయడం అంటే విశేషమేగా మరి.