సక్సెస్‌ ఫుల్‌గా 150 హార్ట్‌ ఆపరేషన్లు...

17:17 - October 29, 2018

నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. మా 150వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. ఆ చిన్నారి పేరు కావ్యశ్రీ. హార్ట్‌లో హోల్ ఉంటే విజయవంతంగా సర్జరీ చేయించాను అని హీరో లారెన్స్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇన్వాల్వ్ అయిన డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు .  హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో లారెన్స్‌ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తాను 150వ హార్ట్ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయించానని లారెన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మీ ఏరియాలో ఎవరైనా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. కుటుంబం ఆపరేషన్ కోసం డబ్బు వెచ్చించలేని పరిస్థితిలో ఉంటే లారెన్స్ చారిటబుల్ ట్రస్టును కాంటాక్ట్ అవ్వండి. నేనిచ్చే ఈ మొబైల్ నంబర్స్‌పై భరోసా ఉంచవచ్చు. 09790750784, 09791500866 అని ట్వీట్‌లో పేర్కొన్నారు లారెన్స్.