సక్కెస్‌ మీట్‌ కు మహేష్‌ వస్తారంట!

12:47 - September 27, 2018

సుధీర్ బాబు తన సొంత బ్యానర్ పై మొదటి ప్రయత్నంగా నిర్మించి.. హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' ఈమధ్యనే విడుదలైంది. సినిమాకు మొదటి రోజునుండి భారీ రెస్పాన్స్ అయితే లేదు.  ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కలెక్షన్స్ డ్రాప్ అవకుండా స్టడీగా ఉండడం. దీంతో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సక్సెస్ మీట్ జరిపి సినిమాకు బజ్ పెంచే ప్రయత్నాలలో ఉన్నాడట. ఇక ఇలాంటి ఈవెంట్ కు తన బావ సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తే అందరి దృష్టిని సినిమాపైకి మళ్ళించవచ్చని ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమా ఈవెంట్స్‌ దేనికీ కూడా మహేస్‌ హాజరు కాలేదంట!...కాబట్టి సక్సెస్ మీట్ కు తీసుకు రావాలని.. సినిమా గురించి నాలుగు మంచిమాటలు చెప్పించాలని సుధీర్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలో సక్సెస్ మీట్ కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారట. దీనిలో సుధీర్‌ బాబు సక్సెస్‌ అయ్యాడా లేదా అన్నది ఫైనల్‌ కలెక్షన్‌ వస్తే కానీ చెప్పలేము. కానీ ఈ సినిమా దర్శకుడు RS నాయుడు.. హీరోయిన్ నభా నటేష్ లకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే ఇద్దరికీ మంచి ఆఫర్లు వస్తున్నాయట.