సంపూ డైలాగ్‌ విని అలా వుండిపోయా : డైరెక్టర్‌ సాయి రాజేష్‌

13:28 - October 22, 2018

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కొబ్బరిమట్ట సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నాక.. ఇంటర్వెల్‌కి ముందు ఏదైనా హై పాయింట్ ఉంటే బాగుంటుందనుకుని.. ఒక డైలాగ్ రాద్దామని డిసైడ్ అయ్యాను. మూడు రోజుల స్ట్రగుల్ తర్వాత ఒక ఐడియా వచ్చింది. నా ఒక్కడి వల్ల కాదనుకుని రఘురామ్ శ్రీపాద సాయం అడిగాను. 8 గంటల శబ్దరత్నాకర మథనం తర్వాత ఒక డైలాగ్ పుట్టింది. రాసిన మాకే నోరు తిరగలేదు. సరిగ్గా 10 రోజుల క్రితం సంపూకి పంపాను. నా వల్ల కాదన్నాడు. మాట్లాడటం మానేశా ఒక రెండు రోజులు. సడన్‌గా పొద్దునే వాట్సాప్‌లో వీడియో వచ్చింది. మూడు నిమిషాల ఆరు సెకన్ల సింగ్ షాట్.. ఊపిరి తీసుకోకుండా చెప్పేశాడు. నోరు తెరుచుకుని అలా చూస్తుండిపోయా. ఎక్కడి హృదయకాలేయం సంపూ... ఎక్కడి ఈ సంపూ.. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత నటుడిగా మీరు సంపూర్ణేష్‌ని ప్రేమిస్తారు అని  సాయి రాజేష్ ట్వీట్ చేశారు.