శ్రీరెడ్డి విషయంలో ' మా ' తీరు కరెక్టు కాదు : నరేష్‌

13:34 - September 4, 2018

శ్రీరెడ్డి సినిమా పరిశ్రమలోని కొందరిపై విమర్శలు, ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇవ్వొద్దని, ఆమెను ఏ తెలుగు సినిమాల్లో కూడా తీసుకోవద్దంటూ కఠిన నిర్ణయంను మా వారు తీసుకోవడం జరిగింది. తాజాగా నరేష్‌ వ్యాఖ్యలతో...మా సభ్యులు ఈ నిర్ణయం విషియంలో ఏకాభిప్రాయంతో వ్యవహరించలేదని తేలిపోయింది. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు శివాజీ రాజా చాలా తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను క్షమిస్తే ఇంకా ఎంతో మంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ అధ్యక్షుడి హోదాలో ఆమెపై బ్యాన్ ను విధించాడు.

ఆ విషియంలో తాను ముందు నుండే వ్యతిరేకించాను.  శ్రీరెడ్డి విషియంలో మా వ్యవహరించిన తీరు సరైనది కాదు అంటూ తాను ఇప్పటికి కూడా చెబుతూనే ఉన్నాను. నేను అన్నట్లే ఆ నిర్ణయం కాస్త వివాదం అవ్వడంతో వెంటనే మళ్లీ హడావుడిగా ఆమెపై బ్యాన్ ను ఎత్తివేయడంతో పాటు ఆమెకు సభ్యత్వం ఇచ్చేందుకు ఓకే చెప్పడం వంటి హడావుడి నిర్ణయాలతో మా పరువు పోయిందని నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మా లో విభేదాలు:

గత కొంత కాలంగా మా లో వున్న విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇదే నేపథ్యంలో మా అధ్యక్షుడు మరియు జనరల్ సెక్రటరీల మద్య కోల్డ్ వార్ జరుగుతుందని తాజాగా తేలిపోయింది. తాజాగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అవినీతి జరుగుతుంది అంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ సమయంలోనే శివాజీ రాజా - శ్రీకాంత్ ల ప్రెస్ మీట్ జరిగింది. వారి ప్రెస్ మీట్ కు కౌంటర్ అన్నట్లుగా నరేష్ కూడా ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ లో పలు విషయాలను లేవనెత్తడంతో పాటు శ్రీరెడ్డి విషయంపై కూడా నరేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.