శ్రీదేవిగా మారిన రకుల్‌..

12:22 - October 10, 2018

క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం గురించి తెలిసిందే. ఇప్పటికే ఇందులో కొన్ని పాత్రలకు కొంతమందిని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఎన్టీఆర్‌ పాత్రలో - బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు పాత్రలో - రాణా, ఎఎన్‌ఆర్‌ పాత్రలో - సుమంత్‌ ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. వీరికి సంబంధించిన లుక్స్‌ కూడ బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్‌ లుక్స్‌ బయటకు వచ్చాయి. కట్టు, బొట్టు విషయంలో శ్రీదేవిని తలపిస్తోంది రకుల్. ఈ బయోపిక్‌కు సంబంధించిన తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని 24న విడుదల చేయబోతున్నారు.