శౌర్యాకి ఇప్పుడైనా మంచి హిట్‌ వస్తుందా?

15:48 - December 8, 2018

యంగ్ హీరో నాగ శౌర్య 'ఛలో' తో గాడిన పడ్డట్టు అనిపించినా.. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు నిరాశపరచడంతో తన నెక్స్ట్ సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు. సుకుమార్ వద్ద గతంలో అసిస్టెంట్ గా పని చేసిన కాశి  శౌర్యాకి ఒక స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ నచ్చడంతో శైర్యా ఆ సినిమా ఒప్పుకున్నాడు.  ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించడానికి సుకుమార్ సిద్దమయ్యాడట.  ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని.. ఈ సినిమాలో శౌర్యకు జోడీగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్.. డేట్స్ విషయాలపై  డిస్కషన్స్ జరుగుతున్నాయట.  అవి ఫైనలైజ్ ఐతే హీరోయిన్ గా పక్కా అయినట్టే.  ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుంది.  సుకుమార్ బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండీగా ఉండే అవకాశం ఉంది.  మరి ఈ సినిమాతో అయినా శౌర్యకు మంచి హిట్ వస్తుందేమో వేచి చూడాలి. నిధి అగర్వాల్   ' సవ్యసాచి' సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.