శిరీష్‌ జాతి రత్నం అవుతాడా?

16:27 - December 13, 2018

అల్లు అర్జున్ తమ్ముడి గా పరిచయమైనా తన ఉనికి కోసం బాగానే కష్టపడుతున్న శిరీష్ కు ఇప్పటిదాకా సక్సెస్ అని చెప్పుకోదగ్గ సినిమా ఒక్క శ్రీరస్తు శుభమస్తు ఒక్కటే.  ప్రస్తుతం ఏబిసిడి లో నటిస్తున్న శిరీష్ దాని ఫినిషింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే మంచి రేట్ కి శాటిలైట్ డీల్ క్లోజ్ కావడంతో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. తాజా అప్ డేట్ ప్రకారం శిరీష్ నెక్స్ట్ మారుతీతో చేయబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. జాతి రత్నం పేరు తో మారుతీ రెండేళ్ల క్రితమే రాసుకున్న స్క్రిప్ట్ కి కొద్దిగా మార్పులు చేసి తెరకెక్కించే ప్రయత్నం చేయబోతున్నారని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అల్లు శిరీష్ ఏబిసిడి పూర్తయ్యాక దీని గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. శిరీష్ మారుతీ కాంబినేషన్ లో కొత్త జంట సినిమా వచ్చింది. కాకపోతే ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే మారుతీ జాతి రత్నాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు వినికిడి. అనౌన్స్ మెంట్ కు టైం పట్టొచ్చు. ఒక్క క్షణం తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న శిరీష్ కు 2018లో తెలుగు స్ట్రెయిట్ సినిమా ఏది రాలేదు వచ్చే సంవత్సరం నుంచి ఏడాది కే రెండు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.