శబరిమల ఆలయంలోని 18 పడిమెట్లు ఎక్కిన ట్రాన్స్‌జెండర్స్‌

15:51 - December 18, 2018

డిశంబర్‌ 16న అయ్యప్ప దర్శనం కోసం బయలుదేరిన నలుగురు ట్రాన్స్‌జెండర్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ నలుగురూ అక్కడే ఆందోళనకు దిగారు. తరువాత శభరిమల ఆలయ ప్రధాన పూజారితో చర్చలు జరిపిన తరువాత ట్రాన్స్‌జెండర్స్‌కు అనుమతి లభించింది. దీంతో ఆ నలుగురు అయ్యప్పను దర్శించుకోని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నీలక్కల్‌ నుంచి పంబ వరకూ, ఆ తరువాత కొండ ఎక్కుతున్న సమయంలో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. ఆలయంలోని 18 పడిమెట్లను కూడా ఆ నలుగురు ట్రాన్స్‌జెండర్స్‌ ఎక్కారు. అయ్యప్పను దర్శించుకున్న ఆ నలుగురూ...అనన్య, తృప్తి, రెంజుమోల్‌, అవంతికలుగా తెలిపారు. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చూ అంటూ ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు తరువాత అక్కడ ఆందోళనలు మిన్నంటిన విషియం తెలిసిందే. ఈ నేపథ్యంలో నలుగురు ట్రాన్స్‌జెండర్స్‌ అయ్యప్పను దర్శించుకున్నారు.