వ్యాధి నిరోధక శక్తి పొందాలంటే...

13:17 - August 21, 2018

దుమ్ములోకి వెల్లినప్పుడు అలెర్జీ రావడం, పక్కవాళ్లు తుమ్మితే వెంటనే జలుబు చేయడం జరుగుతుందంటే...శరీరంలో వ్యాదినిరోధక శక్తి లోపించిందని అర్ధం. ఈ సమస్య రావడానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాహార లోపం వల్లనే వస్తుందని నిపుణలు చెబుతున్నారు. దీనిని అరికట్టేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే....
మనం తినే ఆహారంలో మాంసకృత్తులు, విటమిన్లు, పీచు, విటమిన్‌ సీ బాగా తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ప్రాణవాయువు బాగా అందుతుంది. ఉదయం పూట సూర్యకిరణాలు మన శరీరంపై పడేలా వ్యాయామం చేస్తే...విటమిన్‌ 'సీ' కూడా అందుతుంది. 
ఏదైనా పనిచేసినా, ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. లేదంటే మనం తీసుకునే ఆహారంతో పాటు బ్యాక్టీరియా కూడా శరీరంలోపలికి వెళ్లి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి చేతులు శుభ్రం చేసుకోవడం కీలకమని వైద్యులు చెబుతున్నారు.