వేదింపులకు జరీమానా రూ.68 కోట్లు

11:34 - December 15, 2018

ఈ మద్య కాలంలో మీటూ ఉద్యమం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. మీటూ అంటూ ఎంతో మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న వారిపై సెలబ్రెటీలు కొందరు పరువు నష్టం దావా వేయడం లేదంటే పోలీసు కేసు పెట్టడం చేస్తున్నారు. తాజాగా వేదింపులకు నష్టపరిహారంగా ఏకంగా రూ.68 కోట్లు కట్టాల్సివచ్చింది. వివరాల్లోకి వెలితే...అమెరికాకు చెందిన టీవీ సిరీస్ ‘బుల్’ లో నటి అయిన ఎలిజా ద్రుష్కు గత కొంత కాలంగా తోటి నటుడు వల్ల లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్నట్లుగా మీడియా ముందుకు వచ్చి ఆరోపించింది. నటుడి పై ఆమె లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడంతో అప్పటి వరకు ఆమె నటిస్తున్న ‘బుల్’ సిరీస్ నుండి తొలగించడం జరిగింది. తన ను అన్యాయంగా తొలగించారని తాను లైంగిక వేదింపులను బయట పెట్టినందుకే తనను ఉన్నపళంగా పంపించారని కేసు పెట్టింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ‘బుల్’ సిరీస్ నిర్మాణ సంస్థ అయిన సిబిఎస్ నెట్వర్క్ వారు ఆమెతో 68 కోట్ల రూపాయలతో సెటిల్ మెంట్ చేసుకున్నారు. ఆ సిరీస్ కు ఆమెకు సంబంధం లేదని కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఎలిజాకు పెద్ద ఎత్తున ప్రముఖుల మద్దతు లభించడంతో ఆమె తో సదరు నిర్మాణ సంస్థ సెటిల్ మెంట్ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.