వృద్ధురాలిగా మారనున్న సమంత

12:36 - November 27, 2018

సమంత...ఇప్పుడు ఈమె అక్కినేని వారి కుటుంబంలో ఒకరు. ఈమె కెరియర్‌ మొదటిలో గ్లామర్‌ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చేది. కానీ ఇప్పుడు నటనకు ప్రాధాన్యతనిస్తూ..లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా తీస్తున్నారు. దీనిలో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇదే నేపథ్యంలో సమంత మరో విభిన్నమైన పాత్రను చేయడానికి సమంత అంగీకరించింది. 70 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలి పాత్రలో ఆమె కనిపించనుంది. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్. 2014లో వచ్చిన ఆ సినిమా అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దాంతో దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. నందినీ రెడ్డి .. సమంత కాంబినేషన్లోని ఈ సినిమా, అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. సమంత కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.