వీధుల్లో క్యాట్‌ వాక్‌ ఫోటో పంపండి...10కె గిఫ్ట్‌ పొందండి..

11:59 - October 6, 2018

తాజాగా రకుల్ ప్రీత్ ఓ డిఫరెంట్ ఫ్యాషన్ కాంటెస్ట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ``వీధుల్లో క్యాట్ వాక్ చేయ్.. 10కె గెలుచుకో!`` అన్నదే ఆ కాన్సెప్టు సారాంశం. వీధుల్లో మీరు సహజంగా ఎలా నడుస్తారో అలానే నడవండి. ఆ నడకలకు సంబంధించిన ఫోటోలు - వీడియోల్ని నాకు షేర్ చేయండి. ప్రతి వీధిలోనూ అలా షికారు చేస్తూ ఆ ఫోటో దిగి పంపిస్తే చాలు రూ.10వేల బహుమతి గెలుచుకునే ఛాన్సుంది`` అంటూ ఊరించేస్తోంది. ఇదంతా ఓ ఫ్యాషన్ బ్రాండ్ కి రకుల్ చేస్తున్న ప్రచారం అనుకోవచ్చు. రకుల్ ప్రస్తుతం తమిళంలో కార్తీ సూర్య వంటి అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో క్రేజు తగ్గగానే - అటు తమిళంలో అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఓ సినిమాకి సంతకం చేసిన సంగతి తెలిసిందే. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో హిట్టందుకుని దూకుడు పెంచిన రకుల్ మహేష్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ - చరణ్ - రవితేజ - నాగచైతన్య లాంటి స్టార్ల సరసన నటించింది.