విలన్‌గా మారనున్న మరో యంగ్‌ హీరో

12:37 - November 30, 2018

ఇప్పటికే తెలుగులో యంగ్ విలన్ గా ఆది పినిశెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు మరో యంగ్‌ హీరో ఇదే బాటలో నడుస్తున్నాడు. ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా?. ' బొమ్మరిల్లు ', ' నువ్వొస్తానంటే నేనొద్దంటానా ' సినిమాలు ఎంతగా ఫేమస్సయ్యాయో మనందరికీ తెలుసు. అందులో నటించిన హీరో సిద్ధార్డ్‌ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సిద్దార్ధే ఇప్పుడు విలన్‌గా మారనున్నాడు. నాని హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ థ్రిల్లర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ విలన్ అవసరం కావడంతో, విక్రమ్ కుమార్ .. సిద్ధార్థ్ ను సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు.