విధేయ రామ ప్రీ రిలీజ్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం

16:02 - December 8, 2018

రామ్ చరణ్ సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మల్టీస్టారర్ రెండవ షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ గ్యాప్ లోనే చరణ్ మూవీ వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. జక్కన్నతో పాటు ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకే వేదికపై వీరు ముగ్గురు కనిపిస్తే ప్రేక్షకుల్లో మల్టీస్టారర్ పై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున అంచనాలున్న వినయ విధేయ రామ వేడుకలో జక్కన్న ఎన్టీఆర్ లు కనిపిస్తే సినిమా స్థాయి ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. వినయ విధేయ రామ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అన్ని వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.