విడుదలైన ' 2.ఓ '..పబ్లిక్‌ టాక్‌ ఇలా!..

10:46 - November 29, 2018

భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రోబో 2.ఓ రిలీజైనది. సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలోని విజువల్స్ కళ్లు తిప్పుకోనివ్వడం లేదని చెబుతున్నారు. తొలి అర్ధభాగం శంకర్ డైరెక్షన్ ప్రతిభను తెలిపితే... మలి అర్ధభాగం అతనిలోని సాంకేతిక నైపుణ్యాన్ని బయటపెడుతోందని అంటున్నారు. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారీ సినిమా. సాంకేతికతను ఉపయోగించుకున్న తీరు అద్భుతం అంటున్నారు. ఇంటర్వెల్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయంటున్నారు. రోబో సీక్వెల్‌ను అంచనాలకు తగ్గట్టుగానే తీశారని.. శంకర్ అండ్ కో ఐదేళ్ల కష్టం ఫలించిందంటున్నారు అభిమానులు. సినిమాను ఎక్కడా ఆసక్తిని కోల్పోకుండా.. థ్రిల్‌కు గురి చేసేలా సినిమా రూపొందించారని ప్రేక్షకులు చెబుతున్నారు.