విడుదలకు ముందే రికార్డు బ్రేక్‌

11:45 - October 9, 2018

తమిళ్‌ హీరో విజరు నటించిన తాజా చిత్రం ' సర్కార్‌ ' విడుదలకు మందే రికార్డు బ్రెక్‌ చేసింది. ఈ సినిమా తమిళనాడుతో పాటు తెలుగు, కేరళలోనూ విడుదల కాబోతోంది. దీంతో కేరళ హక్కులు భారీ రేటుకి అమ్ముడుపోయాయి. జీఎస్టీ, డబ్బింగ్‌తో కలిపి మొత్తం రూ. 8.1 కోట్లకు చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇంతకుముందు విజయ్ నటించిన  ' పోకిరి ', ' తుపాకీ' , ' కత్తి ', ' తెరి ', ' మెర్సల్సి ' నిమాలు కేరళలోనూ విడుదలై విజయం సాధించాయి. ఈ కారణంగానే కేరళలో విజయ్ సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇందువల్లే ' సర్కార్సి ' చిత్రం  హక్కులు రూ.8.1 కోట్లుకు అమ్ముడుపోయినట్లు చిత్ర నిర్మాత చెబుతున్నారు. ఓ తమిళ సినిమా హక్కులు కేరళలో ఇంతరేటుకి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. దీపావళికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.