విజయవాడలో సందడి చేసిన విజయ్ దేవరకొండ

11:34 - October 1, 2018

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ' నోటా ' అక్టోబర్ 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. అందుకు విజయవాడలో జరిగిన పబ్లిక్ మీట్‌లో విజయ్ దేవరకొండ, మెహ్రీన్‌కౌర్‌లు సందడి చేసి.. అభిమానులను ఉత్సాహపరిచారు. 

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో అందరికీ ఇష్టమైనది.. సినిమా.. రాజకీయం. అలాంటి ఈ సినిమా, రాజకీయాల్ని కలిపి వస్తున్న పవర్ ఫుల్ జబర్దస్త్ సినిమా' నోటా ' .ఈ సినిమా ద్వారా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అందిస్తున్నామని చెప్తున్నాను. అక్టోబర్ 5న ఈ సినిమా వస్తుంది. ఇంకా నాలుగే రోజులు ఉంది. థియేటర్‌లో కలుద్దాం. చూద్దాం.. సినిమా ఎలా ఉంటుందో. మంచి స్క్రిప్ట్‌తో, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో వస్తున్న సినిమా' నోటా ' మా సినిమాని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.