వరుణ్‌ తేజ్‌ ఆ మెగా ప్రయోగం చేస్తాడా?

12:14 - December 8, 2018

మెగా ఫ్యామిలీ హీరోలందరూ సహజంగా ప్రయోగాలకు దూరంగా ఉంటారు. ఒక వేళ డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకున్నా అందులో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారు.  'రంగస్థలం' తో చరణ్ చేసినట్టు అన్నమాట.  చరణ్ లాంటి స్టార్ వినికిడి లోపం ఉన్న యువకుడి పాత్ర పోషిస్తాడని ఎవరైనా ఊహించారా?. ఇప్పుడు చరణ్ బాట లోనే మరి కొంత ముందుకెళ్ళి మరో మెగా హీరో ప్రేక్షకులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.  ఇంతకీ విషయం ఏంటంటే తమిళంలో హిట్ అయిన 'జిగార్తాండా' సినిమాను తెలుగులో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వరుణ్ మొదటి నుంచి మెగా హీరోల కు భిన్నమైన ఇమేజి తెచ్చుకున్నాడు. 'కంచె' లాంటి ప్రయోగాత్మకమైన సినిమాలతో పాటు .. ఫిదా లాంటి హీరోయిన్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు చేశాడు. ఇక రాబోయే సినిమాలు 'అంతరిక్షం' ఒక స్పేస్ థ్రిల్లర్ కాగా.. వెంకటేష్ తో చేస్తున్న మల్టి స్టారర్ ఒక కామెడి ఎంటర్టైనర్.  అయితే ఇప్పుడు 'జిగార్తాండా' సినిమాలో బాబీ సింహా పోషించిన విలన్ పాత్రను వరుణ్ చేస్తాడట. ఇప్పటి వరకూ హీరో పాత్రలు పోషించిన వరణ్‌ ఇప్పుడు ఈ విలన్ పాత్ర కు సై అన్నాడంటే ఇది మెగా ప్రయోగం అనే అనుకోవాలి. మరి ఈ వార్త నిజమో కాదో వెచి చూడాలి.